Saturday, 18 November 2017

!! స్నేహితులరోజు శుభాకాంక్షలు !!

బ్రతకడానికీ జీవించడానికీ
మధ్య  తేడా  మనసైన
మనుషుల సాంగత్యంలోనే
మనసు గుర్తించగలుగుతుంది....!!

బ్రతకడానికి అన్నీ ఉన్నా
జీవించే మనసూ కావాలి....
మమతనీ ప్రేమనీ
పంచుకునే తోడూ కావాలి..
ఇచ్చిన మనసుని కాపాడే
నిశ్చలమైన మరో నీడ కావాలి
చివరి దాకా కలిసి నడిచే
అడుగు కావాలి....!!

కాలాలు మారినా
కారణాలు మారినా
మరువని  నిజమైన చెలిమి కావాలి...
నిర్లక్ష్యాలను నిలువరించి
అపార్థాలని సంహరించీ..
అలసటలో అలజడిలో
అందించే ఆత్మీయమైన చేయి కావాలి...!!

నీ స్నేహంలోని  మాధుర్యాన్ని
అందమైన అనుభూతులని
ఆసక్తి నిండిన  సంభాషనలని
మననం చేసుకుంటూ
ప్రతి దినం పండగలా సాగిపోవాలి...!!
మన మనసున నందనవనమై
మన స్నేహం పూవులై విరియాలి........!!

 
         అనూశ్రీ--------