Friday, 14 July 2017

==మనవి==

===మనవి===

కవిత్వాన్ని ఆస్వాదించండి
ఆపాదించకండి...
కలానికో గళం
పదానికో స్పూర్తి సహజం...

ఒక్కో మనిషిలో ఒక్కో అభిప్రాయం ఉన్నట్లే
రాసే రచనల్లోనూ వైవిధ్యాలుంటాయి...
కొందరిని ప్రేమ ప్రభావితం చేస్తే
కొందరిని కన్నీళ్ళు కదిలిస్తాయి
కొందరిని విప్లవం రాయమంటే
కొందరిని ప్రకృతి ప్రేరేపిస్తుంది.....

అందరిదీ ఒకే లక్ష్యం కాకపోవచ్చు
అందరూ ఒకేలా స్పందించకపోవచ్చు
కానీ ఎవరి భావనలు వాళ్ళకి గొప్పవి
ఎవరి ఆలోచనలు వారికిష్టమైనవి....!!

మనసు నొచ్చుకున్నప్పుడు...
ఎవరైనా కష్టాన్ని చెప్పుకున్నప్పుడు
ఏ సందర్భమైనా ఆలోచనలో పెట్టినపుడు
ఆ భావనని  అనుభవిస్తూ రాయడం
బాధని అన్వయించి చెప్పడమే లక్ష్యం
అంతేగానీ రాసిన ప్రతీ అంశం స్వయంగా
అనుభవించినది కాదు......!!!
ఎవరినీ బాధ పెట్టాలనీ కాదు....!!

         అనుశ్రీ....
            79

No comments:

Post a Comment