నేనొక అబద్దాన్ని
అర్థం కాని అబద్దాన్ని.....
నిమిషానికో రూపు దాల్చుతున్న
నిజాల మధ్య ఇమడలేక జడుస్తున్న అబద్దాన్ని..
మాటలు నేర్చిన నిజాలకు
మౌనమైన అబద్దాన్ని........!!
నిలువెత్తు నిజాలకి దూరంగా
నిశీధితో చెలిమి చేస్తున్న అబద్దాన్ని......!!
నిజాల నీలి నీడల్ని వదిలి
ఎండమావిగా తపిస్తున్న అబద్దాన్ని.....!!
నిజాలన్నీ గతానికి వదిలేసి
భవిష్యత్ వేటలో మునగని అబద్దాన్ని......!!
దూరమవుతున్న నిజాలని
చేరుకోలేని అబద్దాన్ని......!!
మారలేని నిజాల మధ్య
మాసిపోని అబద్దాన్ని........!!
అవసరాలు తీరగానే
అనవసరమవుతున్న అబద్దాన్ని.....!!!
అను----

No comments:
Post a Comment