Friday, 14 July 2017

!! విరామం!!



విషాదాలకు నెలవైన మదిలోన
వివాదమై  రగిలే యదలోన

చిరునవ్వు కై  పడిగాపులు
సంతోషానికై ఎదురు చూపులు

ఒదిగిన ప్రతిక్షణం
ఎదురు తిరిగి ప్రశ్నిస్తోంది
నీ ఓర్పుకు విలువేమిటని
సహనానికి ఫలమేమిటని....!!

దొరకనంటున్న సమాధానానికై
వెతుకులాటలో అలసి
గతితప్పిన గమనానికి
విరామమిచ్చి విశ్రమిస్తున్నా
వేదన నిండిన మదిని ఊరడిస్తూ
విరాగినై మిగిలిపోతున్నా.......!!

      అను----
       

No comments:

Post a Comment