Saturday, 15 July 2017

---అమ్మ---

చిత్రం సేకరణ రామకృష్ణబాబాయిగారు....

~~~~~~~అమ్మ~~~~~~~

అందమైన అపురూపమైన బాల్యానికి
అమృతమై దొరికిన వరం అమ్మ.....
చందమామను సైతం నేలకు దింపి
పాప బోసినవ్వుల్లో పువ్వులేరుకుంటుంది అమ్మ

రాముడై రాజ్యాల జయించినా
కృష్ణుడై లోకాలను పాలించినా
అమ్మ జోల పాటలో మురిసి
గోరుముద్దలకై ఒడిలో చేరి
ఒదుగుతూ ఎదిగి
తీయని బంధానికి లొంగినవారే...

చిన్నిచిన్ని మాటలతో
గడసరి అల్లరులతో
అమ్మచెంత చేరి గారాలు కురిపించి
అమ్మనెంతో మురిపించి
అనురాగ నందనవనాన
విహరించి మైమరిచినవారే....

కౌసల్యా తనయుడై యశోద నందనుడై
దేవదేవులు సైతం నేలపైకి దిగివచ్చి
చవిచూసిన  ఆత్మీయభావం అమ్మ....
కనుల ముందు మెదిలే ప్రేమమయి అమ్మ....

కథలెన్ని చెప్పినా కవితలెన్ని రాసినా
తరగని మహాగ్రంథం అమ్మ.....
బాల్యాన భవితకై
గమ్యంచేరాక క్షేమానికై
నిరంతర హోమం చేస్తూ
సమిధయ్యే  త్యాగం అమ్మ...!!
కలాల కందని భావం అమ్మ..
గాథగా మదిలో మిగిలే
మరువలేని నిజం అమ్మ...!!
     
         అనుశ్రీ....

          

No comments:

Post a Comment