ఎండా కాలం--మండే కాలం....
ప్రాణాలు అరచేతుల్లో
నడకలు ఎడారుల్లో......
ఉష్ణమండలంపై తపిస్తూ
దాహంతో తలపోస్తున్న
చిన్ని చిన్ని ప్రాణాల ఇక్కట్లు...
ప్రభలమవుతోంది
ప్రచంఢ భానుని ప్రతాపం...
సాగనంటోంది సామాన్యుని
జీవన పోరాటం......
భవనాల మాయలో పడి
బ్రతుకు బోరు మంటోంది
చెట్టూ పిట్టల మాట
పెడచెవున పెట్టేసి నగర విస్తరణకై
అడవులన్ని ఆక్రమించి
పచ్చదనాన్ని సాగనంపాం
వెనక మనమూ నశిస్తున్నాం....
జనారణ్యాన చెట్టునీడన్నది కానరాదు
వాగులకూ వంకలకూ చోటే లేదు
భూమాత ఒంటికి కాంక్రీటు పూతలేసి
చుక్కనీరు పొదువుకునే హక్కూనే లాగేసి
బోర్లతో మోటర్లతో మిగిలి ఉన్న తడిని లాగి
ఎడారిగా మార్చేసాం ఎండలో మాడుతున్నాం....
సిమెంట్ వనంలో కాలుష్యపు ప్రయాణం
ఎటుచూసినా రంగు రంగుల మేడలు
సేదతీరేందుకు కానరావు
పచ్చదనపు నీడలు....
ఇప్పటికీ తేరుకుని కళ్ళుతెరవకుంటే
సహజత్వపు జీవనమంటే
ఇక పై గత కాలపు వైభవమే....!!
అనుశ్రీ....

No comments:
Post a Comment