Saturday, 15 July 2017

!! అందం !!

Pvr Murty గారి చిత్రం

!!!!! అందం !!!!

మనసుకన్నా మంచికన్నా
ప్రేమకన్నా పద్దతికన్నా
అన్నిటి కన్నా పెద్దపీట
అందానికే వేస్తారెందుకో కొందరు....!!

సుగుణాలను మించిన సుకుమారం
జ్ఞానాన్ని మించిన సున్నితతత్వం
మమతని పంచే మాట కన్నా ముగ్ధత్వం
ఏ భావనెరుగని ముఖంలో ఎలా చూస్తారో..

అంతులేని ప్రవాహం అందం
ఒకరిని మించిన అందం మరొకరిది
ఒకరి రంగుని మించిన రంగు మరొకరిది
అంచనా వేసి ఆగేందుకది కథో చిత్రమో
లేక అక్కడితొ ఆగిపోయే చరిత్రో కాదు
నిరంతరం కనులముందు మెదిలేదే...

ప్రకృతిలో పచ్చదనం వెలుగులు
వెన్నెల--వేకువ ఉన్నంతకాలం
ప్రతి మనసులోను ఓ అందం
మెరవక మానదు అలరించకా మానదు...

అందాన్ని అభినందించడంలో తప్పులేదు
పొగడడంలోనూ ముప్పేం రాదు
కానీ శాశ్వతం కాని అందం
వయసుతో పాటు అంతరించే అందం
కాలగర్భంలో  కలిసిపోయే అందం కోసం
ఎదుటివారిని తక్కువ చేయడం నేరం

విదివశాన బ్రహ్మదేవుడి చేతిలో
తీర్చిదిద్దబడని మనుషులను
అవమానించడం హేళన చేయడం
వారి అంతరంగంలోని సంకుచితత్వానికి
అద్దంలా కనిపించే సజీవ రూపం....!!

అందులో ఆనందాన్ని పొందే
అల్పతత్వాలకు ఏదో రోజు బోధపడకతప్పదు.......
లోపాలు తమలోనూ ఉంటాయని
‌తమకీ వయసు ముదురుతుందని
శిల్పాలం కాదుగా యుగాలు గడిచినా
తరగని వన్నెలతో మురిసిపోడానికని....!!

శరీరానికి  అవిటితనం దేవుడి పరీక్ష
కానీ మనసు అవిటితనం తనకి
తన చుట్టు ఉన్నవాళ్ళకి కూడా శిక్షే..
బంగారం లాంటి రూపం కాదు అందం
అలాంటి మనసుండడం అందం ఆనందం..
రూపం మూన్నాళ్ళే  గుణం వెయ్యేళ్ళు..!!

               అనుశ్రీ
                 103

No comments:

Post a Comment