Saturday, 15 July 2017

----------కాపాడండీ-------



కాసిన్ని నీళ్ళుపోసి  మాపై
కనికరాన్ని చూపండి...
వేకువ రాగాలతో
మీ కనుల విందు మేమవుతామండీ...!!

అల్పజీవులమని  అలుసుగా చూడకండి
కష్టజీవుల మనే మాట మరిచిపోకండి...!!
యుగాలు మారినా మారని
మా జీవన గమనాన్ని గమనించండి....!!

గూళ్ళు లేక నీళ్ళు లేక పచ్చదనం జాడలేక
 మౌనంగా రాలుతున్నాం
కాస్త మార్పు చూపండి
 మా రాత మార్చి రాయండి....!!

అంతరిస్తున్న మా జాతిపై జాలి చూపండి
అడుగడుగు ప్రమాదాల చెర విడిపించండి
మా గుప్పెడు ప్రాణం నిలబెట్టుకునేందుకు
పడుతున్నాం యాతన గుర్తించండి...!!

అంతరిస్తున్న అడవి సంపదతో
ఆవిరవుతున్నాయి మా ఆశలన్నీ...
చిటికెడంత ప్రేమ చూపి కాపాడండి
మానవతలో దైవత్వం చూపించండి.!!

మరువబోము మీ మేలుని
మరిచిపోము మీ మంచిని
మీ వాకిట కువ కువలై
విశ్వాసం చూపుతాం విజ్ఙతతో  మెలుగుతాం.

     అనుశ్రీ.....
          

No comments:

Post a Comment