నిబ్బరాన్ని కోల్పోకుండా
నిశ్చలంగానే ఉంది మనసు....
అయినా తెలియకుండానే
ఏదో అలజడి లోలో
సడి లేకుండా వ్యాపిస్తోంది...
సరి చేయాలని ఆశిస్తోంది....!!
అన్నీ ఉన్నా ఏదో అసంతృప్తి
బహుశా ఇలా ఉంటేనే
జీవితం అని అంటారేమో.....?
మనకోసం మనలాగ ఆలోచించే మనసు
మనకై దొరకడమంటే ....
కలగా కూడా జరగదేమో...!!
జరిగితే అది కలేనేమో....!!
అను--
21

No comments:
Post a Comment