ఒక తీయని కలలోంచి మెలుకువ
జరగదని తెలిసినా ఊహలా అనిపించినా
మనసుని కాసేపు హాయి తరంగాలపై
తేలియాడేలా చేస్తుంది........!!
సంతోషాన్ని దుఃఖాన్ని దాచలేని కళ్ళు
మదిలోని మర్మాన్ని తనువుకూ అంటించి
అరక్షణమైనా సరే ఆనందించమంటూ
అదేశాలను అందిస్తుంటాయి.....!!
కల లాంటిదే జీవితం కూడా
ఎప్పుడు మెలకువ పిలుస్తుందో
అప్పుడు ఆగిపోక తప్పదు....
కరుగుతున్న కలగా జీవితం
ముగిసిపోక తప్పదు.....
అది మధురమైనదా చేదునింపిందా
ఏదీ అడగదు కాలం
నడిపించినంతకాలం తప్పటడుగు
పడనివ్వక తృప్తిగా ముగింపు పలికితే
అదే పరిపూర్ణమైన సాకారమైన కల...!!
అనుశ్రీ.....
129

No comments:
Post a Comment