నమ్మకం అబద్దాన్ని కూడా
నిజమనేలా చేస్తుంది
మోసాన్ని కూడా అంగీకరించేలా చేస్తుంది
కళ్ళకు అంటుకున్న పొరలు
ఎప్పటీకో గానీ వీడిపోవు.....!!
వమ్మయి పోయిన నాడు
కన్నీరుగా కురిసినపుడే
వంచన పాలైన విషయం తెలిసేది...
తేరుకుని బయటపడే యోచనుంటే
ఎదురుతిరిగి ప్రశ్నించే ఓపికుంటే
పాత బంధాన్ని ప్రేమని వదిలేసి
నిలదీసి అడిగితే వచ్చే సమాధానం ఒక్కటే
నీ నమ్మకమే నిన్ను ముంచిందని...
కుట్రలు కుతంత్రాలు తెలిసినవాళ్ళకి
మంచి విలువ తెలుస్తుందనుకోవడం
మనం పంచే అనురాగం
మనలను ప్రేమించేలా చేస్తుందనుకోవడం భ్రమ
మనసు విలువ తెలియని వాళ్ళ
నడతే ఒక పద్మవ్యూహం
అందులో చిక్కి బలయ్యాక
ఏమనుకున్నా ప్రయోజనం శూన్యం...!!
మాటలతో కోటలు కట్టి
పొగడ్తలతో హోరెత్తించి
అవసరం తీరగానే కనుమరుగయ్యే
ఎందరో ముసుగు మనుషులు
మనచుట్టూ మాటువేసుంటారు.....
ఉచ్చు బిగుసుకోకముందే
ఉపాయంగా ఎదురుదెబ్బతీసే
నేర్పు మనలో ఉండాలి.......
కనిపెట్టే నైపుణ్యం నేర్చుకోవాలి....
కలల ప్రపంచాన్ని తెలివిగా చేరుకోవాలి.....!!
అనుశ్రీ.....

No comments:
Post a Comment