కష్టాలు కలకాలం
ఉండవని తెలిసినా
ఆ క్షణకాలమైనా తోడుకావాలని
ఆరాటం ఎందుకోమరి మనసుకి...!!
ఆవేదన తీరేలా
అక్కున చేర్చుకునే ఆత్మీయతకై
పలవరిస్తుంది ఎందుకో మరి...!!
కాలం ఎలాగైనా గడుస్తుంది
నీతో ఎవరున్నారని
అడగకుండానే నడుస్తుంది..!!
ఐనా ఆశపడడం మాననంటొంది
ఎదురు చూస్తాననే అంటోంది...!!
--అను--
No comments:
Post a Comment