Friday, 14 July 2017

*** ప్రబంధం***

Pvr Murty  గారి చిత్రానికి నా కవిత..



నన్ను ప్రతిదినం పలకరించి
ప్రతి ఉదయాన్ని శుభోదయంగా
చూపాలనే తన తాపత్రయానికి
కునుకు నింపుకున్న తన కనులపై
పెదవి అంచుల తడిమే
చిరుముద్దునవుతాను........!!

నన్ను నియంత్రణలోకి
తెచ్చుకునే ప్రతీప్రక్రియలోనూ
తానో నియంతననుకునే భ్రమలో
నా ప్రేమకు వశమౌతూ ...
ఒలికించే హావభావాలను చూసి
పులకించి మైమరచి తనకు నేనే దాసోహమవుతాను....!!

నా చంపలపై జారే కన్నీళ్ళు చూసి
తన కోపాగ్ని  చల్లారి చెంత చేరి
అరచేతుల్లో  నా మోముని పొదువుకుని
తన ఆరాధనని చూపిస్తుంటే...
కరుగుతున్న  బెంగనై
తన యదపై వాలిపోతాను.....!!

మదిలోని చీకటంతా
తన వెన్నెల నవ్వులతో తొలగించి
చెదిరిన నా  ఆలోచనల పరంపరని
మృదువుగా  సరి  చేసి....
ఆగిన  ఆనందపు  సమీరాలని
తన   ఊపిరితో  కొనసాగిస్తుంటే......!!
మాటలు రాని  మైనపు   బొమ్మనై
తన   కౌగిలిలో   కరిగిపోతాను.........!!

నా కొంగులో   దాచుకున్న  బెంగలన్నీ
తను  సుతారమై  తాకుతూ  తొలగిస్తుంటే
మౌనమైన   నా మససు  భాషని
తన  కనులలో  చదువుతుంటే....
గుండెలోని భారమంతా
తన ఒడి నీడలో తేలికై
పసితనపు  గారాబమై
అనురాగాల తన మది గదిలో
హాయినై   బ్రతుకంతా  సేదతీరుతాను....!!

          అను-------
            80

No comments:

Post a Comment