~~~~అత్యాశ~~
ఏది ఆశించాలో ఏది వదులుకోవాలో
ఆలోచించాకే నిర్ణయించుకోవాలి
పొందే లాభాలు నష్టాలు
బేరీజు వేసుకున్నాకే అడుగు
ముందుకు వేయాలి.........!!
యోచన లేని ఆచరణ
ప్రతి క్షణం ప్రమాదాన్నే సూచిస్తుంది
స్వల్ప విషయాలకు విలువిచ్చి
అమూల్యమైన ఆనందాలను
కోల్పోయి బాధపడడం కన్నా
తెలివిగా తెమలడమే మిన్న...!!
అవివేకంతో చేసే ప్రతిచర్యా
సంతోషాలనూ దూరం చేస్తుంది
నిరాశలకు దారినిస్తుంది
చేయాల్సిన పొరపాట్లను చేసేసి
తీరిగ్గా బాధపడితే
ప్రయోజనం శూన్యం....!!
ఏదో పొందాలనే ఆరాటంతో
అసలైన అనుభూతులను కోల్పోతూ
అవసరం లేని డాంబికాలకు లొంగి
అంతరాత్మను సైతం పక్కన పెట్టడమే
ఆవేదనకు అసలైన కారణం......!!
అనుశ్రీ....
~~~~అత్యాశ~~
ఏది ఆశించాలో ఏది వదులుకోవాలో
ఆలోచించాకే నిర్ణయించుకోవాలి
పొందే లాభాలు నష్టాలు
బేరీజు వేసుకున్నాకే అడుగు
ముందుకు వేయాలి.........!!
యోచన లేని ఆచరణ
ప్రతి క్షణం ప్రమాదాన్నే సూచిస్తుంది
స్వల్ప విషయాలకు విలువిచ్చి
అమూల్యమైన ఆనందాలను
కోల్పోయి బాధపడడం కన్నా
తెలివిగా తెమలడమే మిన్న...!!
అవివేకంతో చేసే ప్రతిచర్యా
సంతోషాలనూ దూరం చేస్తుంది
నిరాశలకు దారినిస్తుంది
చేయాల్సిన పొరపాట్లను చేసేసి
తీరిగ్గా బాధపడితే
ప్రయోజనం శూన్యం....!!
ఏదో పొందాలనే ఆరాటంతో
అసలైన అనుభూతులను కోల్పోతూ
అవసరం లేని డాంబికాలకు లొంగి
అంతరాత్మను సైతం పక్కన పెట్టడమే
ఆవేదనకు అసలైన కారణం......!!
అనుశ్రీ....
No comments:
Post a Comment