!!
అలజడి రేపే ఆలోచనలకు
అంతమనేదే లేదా...
అందుకోలేని ఆశలతీరం
చేరుకునేదే లేదా....
అవని లోన అతివ ప్రేమకు
అర్థమనేదే లేదా......?
అలుపే లేనీ తన పయనంలో
కుదుట పడుట వింతేనా..
అంబరమంటి తన మనసులోన
సంబరమంటే కలనేనా...
ప్రకృతిలాగా మమతను
పంచే తన బ్రతుకున
చిగురే తొడగనిదా...
మంచిని నేర్పే తన మదికి
వంచనలే ఇక లాంచనమా..
ఒడినే గుడిగా
మలచిన తనకు
చివరి పయనం చితికేనా...!!
అను----
30
అలజడి రేపే ఆలోచనలకు
అంతమనేదే లేదా...
అందుకోలేని ఆశలతీరం
చేరుకునేదే లేదా....
అవని లోన అతివ ప్రేమకు
అర్థమనేదే లేదా......?
అలుపే లేనీ తన పయనంలో
కుదుట పడుట వింతేనా..
అంబరమంటి తన మనసులోన
సంబరమంటే కలనేనా...
ప్రకృతిలాగా మమతను
పంచే తన బ్రతుకున
చిగురే తొడగనిదా...
మంచిని నేర్పే తన మదికి
వంచనలే ఇక లాంచనమా..
ఒడినే గుడిగా
మలచిన తనకు
చివరి పయనం చితికేనా...!!
అను----
30

No comments:
Post a Comment