మీ చిరునవ్వులకై మా చిరుకానుక
అలనాటి పాట అందమైన పాట
అనురాగమే రాగంగా
ఆత్మీయతే భావంగా
నేటికీ తీపి తరగని
మా అందరి మదిలో వినిపించే
మీ అనుభూతుల తేనె ఊట......!!
మంచితనానికి తోడైన సహనం
ఉత్సాహానికి జంటైన శాంతం
చిరు నగవుల రాజిల్లుతూ
ప్రేమ దీపికలై శోభిల్లుతూ
మమతానురాగాల నీడలో
నడుస్తున్న ఆదర్శ జంట......!!
ఆదిదంపతులై
అప్యాయతకు ప్రతిబింబాలై
మన స్నేహవనంలో
వాడని పరిమళ సుమాలై
మనలను వీడని బంధాలై
కలకాలం నిలవాలని ఆశిస్తూ...
ప్రియాతి ప్రియమైన
పిన్ని బాబాయి లకు
వివాహదినోత్సవ శుభాకాంక్షలు....!!
అనుశ్రీ....
అలనాటి పాట అందమైన పాట
అనురాగమే రాగంగా
ఆత్మీయతే భావంగా
నేటికీ తీపి తరగని
మా అందరి మదిలో వినిపించే
మీ అనుభూతుల తేనె ఊట......!!
మంచితనానికి తోడైన సహనం
ఉత్సాహానికి జంటైన శాంతం
చిరు నగవుల రాజిల్లుతూ
ప్రేమ దీపికలై శోభిల్లుతూ
మమతానురాగాల నీడలో
నడుస్తున్న ఆదర్శ జంట......!!
ఆదిదంపతులై
అప్యాయతకు ప్రతిబింబాలై
మన స్నేహవనంలో
వాడని పరిమళ సుమాలై
మనలను వీడని బంధాలై
కలకాలం నిలవాలని ఆశిస్తూ...
ప్రియాతి ప్రియమైన
పిన్ని బాబాయి లకు
వివాహదినోత్సవ శుభాకాంక్షలు....!!
అనుశ్రీ....

No comments:
Post a Comment