వదిలేయక తప్పదేమో
కొన్ని జ్ఞాపకాల దొంతరలని...
కాలం మంచులా కప్పేస్తుంటే
వర్తమానం భవిష్యత్తుకై పరుగెడుతుంటే..
కొన్ని రాలిన కన్నీటి చుక్కలుగా
గతపు చీకటి మలుపుల మాటున
కనులు చూసిన కలల చాటున
రమ్మన్నా తిరిగిరాని అనంతమైన
అంతరంగం పొలిమేరలలో...
కలగా మారిన నిజాలు
ఎన్నో పాఠాలు నేర్పిన తప్పులు
ఏవో సందేశాలిచ్చిన మార్పులు
జీవితాన్నీ పదమంటూ నడిపించిన
అరుదైన కొన్ని అనుభవాలను.....
ఏదో ఒక రోజు స్మరించి
నిమిషం పాటు రెప్పవేయనీయని
అతిచిన్న స్మృతిగా ...
వదిలేసి వెళ్ళిపోవాలి....
మరో కొత్త భావాన్వేషణల కోసం..
బ్రతుకు నడగ సాగిస్తూనే ఉండాలి..!!
అనుశ్రీ....
93

No comments:
Post a Comment