Saturday, 15 July 2017

విడుదల



అంతమెరుగని పయనంలో
అంటుకున్న అబద్దమై
వేసుకున్న ముసుగు తొలగే
అరుదైన నిముషముకై
ఎదురుచూస్తోంది నాలోని
ఆవేదన.....!!

అనుభూతులను బంధీచేసి
ఆహుతైన జీవితాన్ని
అందంగా చూపలేక
అలుగుతున్న కాలాన్ని
అనునయించే దినం కోసం
చేస్తోంది నా మనసు ఆలాపన......!!

గొంతుదాటి రాలేక
 మూగదైన  గుండెకోత
కలలన్నీ నిశిలోనే
కన్నీరై  కరుగుతుంటే
కలత    తీరు రోజు ఎపుడని
నిలదీసి అడుగుతోంది
నాలోని   ఆక్రందన...!!

 అంతరంగాన   ఆయువుతీరి
 ఆవిరైన  ఆశలన్ని అలసిసొలసి
మోయలేని భారమై   తీరలేని నేరమై దహిస్తున్న  మనసుని  దాచలేక ఇస్తున్నా
తను కోరుకున్న   విడుదలని....!!!

              అను...

No comments:

Post a Comment