పగిలిన ప్రతిసారి
కన్నీళ్ళ లేపనంతో
నమ్మకాల దారంతో
గాయమైన గుండెకు
అతుకులేస్తున్నా,....
రగులుతున్న జ్వాలగా
మండుతున్న హృదయాన్ని
కన్నీళ్ళు గుమ్మరించి
చల్లార్చి వేస్తున్నా.....
వేదన వెంటాడి
విరక్తిని మోసుకొస్తుంటే
విషాదపు కళ్ళతోనే
వీడుకోలు చెబుతున్నా,....!!
మదిలొ వెతలెన్ని వెలేస్తున్నా
కదిలే గతంలోకి తోసేస్తున్నా
జ్ఞాపకాల నీలి నీడల మాత్రం
చెరపలేకున్నా...!!!
కఠినమైన నిజాలని కరిగించలేకున్నా...!!
అను-----
35

No comments:
Post a Comment