నా కళ్ళకి మాటిచ్చాను
కన్నీళ్ళు రానివ్వనని....
నా మనసుకి నచ్చజెప్పాను
నచ్చనిది చేయబోనని...
నా ఆశని బంధించాను
అందని చోటుకు ఎగరబోకని...
ఆలోచనలను అడ్డుకుంటున్నాను
నా ఆజ్ఞలోనే ఉండమని......
అంతరంగాన్ని ఆదేశించాను
అనువుగా మసులుకోమని.....
సందేశాలకు సెలవులిచ్చాను
సందేహాలకు తావివ్వకని.....
బంధాలను బందీ చేసేసాను
భారాలుగా మారకూడదని.....!!
నాతో నేనే రాజీ పడుతున్నాను....
నాలో నేనే విశ్రమించాలని.......!!
---------అనుశ్రీ------
83

No comments:
Post a Comment