Friday, 14 July 2017

~బంగారం


~~~~~~

జరిగేది ఏ శుభ కార్యమైనా సరే
నేనుండాలంటూ ఆరాటపడుతుంది
మగువల మదిలో తిష్టవేసుంటుంది
మగవారి మనసులో గుబులు పుట్టిస్తుంది
విలువైన దేదైనా పోలికలో అమరుతుంది
సింగారమై మెరిసే బంగారం.....!!

పసిపాప నుండి పండు ముసలి దాకా
ఆనాటి నుండి ఈనాటి దాకా
కాస్తంతైన పట్టుతగ్గని పట్టపురాణి
కాంతల మనసులో మెరిసేటి మారాణి

పండగొచ్చిందంటె సందడి నాదంటుంది
పెళ్ళి కుదిరిందంటె పెత్తనం చేస్తుంది
కూతుల్ల పై ప్రేమ-కోడళ్ళకై ధీమా
పేరెత్తితే చాలు నోట్లు లెక్కంపుతెిస్తుంది

నిశ్చితార్థమంటే నేనుండాలి అంటుంది
ఆలుమగల బంధం నేనేగా అంటుంది
అగ్నిలో దూకినా అందమై పూస్తుంది
అలంకరణలెన్నున్నా నా తరువాతే అంటుంది.....
అప్పు చేసైనా సరే అందుకోమంటుంది
చేతులెన్ని మారినా విలువ తగ్గనంటుంది..

ఇనుప పెట్టెల్లోన భద్రంగా ఉంటుంది
తరతరాల ప్రేమని తలా ఇంత పంచుతుంది
ప్రేమలకు గుర్తుగా ఆత్మీయతకు సాక్షిగా
అమ్మ మెడలో హారమై ఆలితో బంధమై
సాంప్రదాయాలతో సహవాసి నంటుంది
ఏ ఆపదొచ్చినా నే లేనా అంటుంది.......!!

       అనుశ్రీ....
        71

No comments:

Post a Comment