Saturday, 15 July 2017

బంగారం



నీ చిన్నారి నవ్వులు
వేల వసంతాల సుమాలు
నిన్నే చూస్తూ మేలుకునే
ఉదయాన్ని నేను
నా కనులలో మెరిసే కలవు నీవు
నిన్ను మించిన స్వర్గం
నీకన్నా ఆనందం
ఉండబోదు నా బ్రతుకున...

అర్థం లేక సాగుతున్న
నా జీవన నదిలొ
యదార్థమై విరిసిన
నీ కలువ నవ్వులకై
నిత్యం నే తపిస్తున్నా....!!
నా ఆశకు రూపమై
అల్లరితో అలకలతో అలరించే
నీ ముద్దుల మోము చూస్తూ
నన్ను నేనే మరిచిపోతున్నా...

నీ పెదవుల దరహాసాల
మాధుర్యాలకై
నా ఊపిరితో ఊయలలు
ఊగించుతున్నా...
సుమధుర సౌరభాల మాలికలలొ
నీ భవిత పూలవన విహారమై
సాగాలని కోరుకుంటున్నా...!!

అమృతమై నా మనసున కురిసే
నీ గారాల మురిపాల సరదాలకై
నీ బాల్యపు కాలాన్ని మరింత కావాలని
తనివి తీరని నీతో బంధానికి
నిత్యం నేనే ఋణపడిపోతున్నా.....!!

         అను------49

No comments:

Post a Comment