Saturday, 15 July 2017

అంతరాత్మ




ఈ శరీరం  కప్పుకుని
 ఇంకా  ఎంత కాలం   తిరగాలని
వేధిస్తోంది   నన్ను  నా  అంతరాత్మ...!!

నచ్చని   మనుషుల  మధ్య
నచ్చని   బంధాల మధ్య
దొరకని   ప్రేమల   మధ్య
ఇమడలేక    విలపిస్తోంది...!!

పంజరంలో   పక్షిలా
అర్థం  కాని  ప్రశ్నలా..
ఓదార్చమంటూ   దొరకని
సమాదానాలను   కోరుతోంది..!!

మనిషిగా చెప్పుకుందామంటే
 సమాదానం లేదు
ఆత్మసాక్షి గా
ఉండే నిబ్బరం లేదు..!!

అయినా సరే
జీవితాన్ని  అనుభవించాలి
బాద్యతల్ని నెరవేర్చాలి
ఆశల్ని  సమాధి  చేయాలి
కలల   సంహారం  చేయాలి
ఎందుకంటే   బ్రతకాలి..!!

నచ్చని   జీవితమనే   శిక్షని
నవ్వులు   పూసుకుని   అనుభవించాలి..!!
స్మశానంలో   జీవంలా
ఈశరీరంలో  ఆత్మను
నడిపిస్తూనే   ఉండాలి...!!
         --అను---7

No comments:

Post a Comment