కన్నీళ్ళు నా కనుల నేస్తాలు...
సంతోషాల్లో- సమస్యల్లో
భావాలలో-భావోద్వేగాలలో...
గెలుపులలో -మలుపులలో..
అభిమానాలలో-అవమానాలలో..
మరపురాక మదిని తడిమే
గతమైన కొన్ని జ్ఞాపకాలలో...
గుండె స్పందించిన ప్రతిసారి
కన్నీరే ఒలుకుతోంది...
వెచ్చని చెలిమై స్పృశిస్తోంది...!!
ఓదార్పై మదిని సేదతీర్చుతోంది..!!
వీడని బంధమై మిగిలిపోతోంది...!!
అను..

No comments:
Post a Comment