Saturday, 15 July 2017

--అమ్మ--

అమ్మ ....

ఆత్మీయతకు ప్రతిరూపం అమ్మ
అనురాగపు సంగీతం అమ్మ
అడుగడుగునా అనుసరించు
అంతులేని మమకారం అమ్మ...

ప్రేమ గుణానికి నిజమైన అర్థం అమ్మ
నిస్వార్థానికి అసలైన రూపం అమ్మ
గగనమంత ఉన్నతం
పుడమి వలె శాశ్వతం అమ్మ
పుష్కరిణిలో పుణ్యాలన్నీ
తన ఒడినదిలో నింపుకుని
పునీతుల చేసే ఆలయం అమ్మ...!!

తరగని ప్రేమకు పెన్నిధి అమ్మ..
నిరంతరం మనకై తపించే
నూరేళ్ళ తాపసి అమ్మ.......!!
తన దీవెనలన్నీ వరాలై
తన మనసంతా సంతోషమై
కలకాలం నిలవాలని ఆశిస్తూ....!!
అమ్మలాంటి మనసుతో నను దీవించిన
ప్రతీ అమ్మకు  అంకితం....!!
మాతృదినోత్సవ శుభాకాంక్షలు.....!!

           అనుశ్రీ....

అమ్మ గురించి ఎంత చెప్పినా ఇంకా ఏదో మిగిలే ఉంటుంది ఎప్పటికీ........!!!

           101

No comments:

Post a Comment