నిన్ను నేను మోసింది
పదిమాసాలే
కానీ గుండెల్లో మోస్తున్నా
నువ్వు గుర్తొచ్చిన ప్రతిక్షణం..!!
మళ్ళీ ఏ జన్మలో నువ్వు
తారసపడతావోనని
నీకు తెలిసిన ఈజన్మనే
కోరాలని ఉంది..!!
నువ్వు పిలిచే పిలుపు కోసం
నీకై కన్న కలల కోసం
పచ్చని చెట్టుకు పువ్వులా
ఒకే రోజు మురిపించిన నవ్వులా
నన్ను పండించి రాలిపోయిన నిన్ను
తిరిగిరావని తెలిసినా మళ్ళీ
తనివితీరా ఒక్కసారి
చూడాలని ఉంది...!!!
--అను--

No comments:
Post a Comment