Saturday, 15 July 2017

--అసలైన రంగు--



రంగుల ప్రపంచంలో
హంగుల కోలాహలంలో
నేనూ ఒక వర్ణమై
వెలగాలని అనుకున్నా......

ఊహల ఉయ్యాలలో మహరాణినై
వెలుగు సౌధాన కిరణమై
మెరవాలని అనుకున్నా
కాని చూపలేని రంగులెన్నో
మనసులో రూపుదిద్దుకుంటుంటే
కలల సంగతే మరచి కలత చెందుతున్నా

జీవితమంటేనే అనుభవాల రంగేళి
అనుభూతులెలా ఉన్నా ఒప్పుకోక  తప్పదని
బదులు తోచకున్నా భరించడమే మార్గమని
బాధలనూ- వేదననూ-కలతలను
ఓర్పనే   నీటితో కడిగేసి
స్వచ్చమైన  వన్నెలతో
నిలవడమే చివరి గమ్యమని ఒప్పుకుంటూ
మనుగడకై  మనసుని సిద్ధం చేస్తున్నా......!!

       అనుశ్రీ.....

         

No comments:

Post a Comment