నా ప్రేమకి ప్రాణం వచ్చి
నా అరచేతుల్లో అందంగా ఒదిగినట్టుంది....!!
నా కనులు పండించిన కలలన్నీ
ఒక్కసారే వరమై నను చేరినట్టుంది...!!
సృష్టిలోని తీయదనం
స్వర్గంలోని అమృతగుణం
అన్నీ కలిసిన అమ్మతనం..
ఆప్యాయంగా నను ఆవహించినట్టుంది....!!
నా ఊహలో చూసిన నీరూపం
నిజమై ఎదురుగా కనిపిస్తుంటే
నా పూజలన్నీ ఫలించి
నీ రూపమై నా దరి చేరినట్టుంది.....!!
మురిసిన నా మనసుకి
నీ ముద్దు మురిపాలే కానుక..
వేచిన నా బ్రతుకున
నీ అడుగులే నాకు తోడిక.....!!
నా దీవెలన్నీ అందుకుని
బంగారు భవితవై ఎదిగి
నా కనుల ఆనందభాష్పానివై
నువు నూరేళ్ళూ వెలగడమే
ఈ అమ్మ కోరిక...!!
అను----

No comments:
Post a Comment