Saturday, 15 July 2017

నడక



నిలకడైన నడకనై
దారులన్నీ వెతుకుతున్నా..!!

నిశ్చలమైన ఆలోచనై
నిగ్రహంగా తరలుతున్నా..!!

నీడలన్నీ తోడై రావాలని
చీకటులన్నీ  వెలుగులై నిండాలని!!

ఆశల సౌధానికై
ఆరాటాల నిచ్చనల్ని
ఆసరా అడుగుతున్నా...!!

చేరుకునే గమ్యంతో
స్నేహాన్ని చేస్తున్నా....!!!

ఒంటరి పయనానికి
ధైర్యాన్ని తోడై రమ్మని పిలుస్తున్నా...!!!

     ----అను----
     

No comments:

Post a Comment