వదిలేది మాటే
కానీ తూటాకన్నా వేగంగా
ఎదుటి మనిషి గుండెలోకి గుచ్చుకుంటుంది
గొంతును పూడ్చేసి కళ్ళనిండా నీళ్ళుగా
భరించిన నొప్పిని బయటపెడుతుంది..
దగ్గరితనాన్ని దూరంగా విసిరికొడుతుంది..!!
అనే నోటికి తెలుసు
మనసు ముక్కలవుతుందని...
వచ్చేమాటకి తెలియదు
ఎంతలోతుగా ప్రయాణం చేస్తుందో.....
ఎన్ని అనుభూతులను బలితీసుకుంటుందో...
అంతరంగాన చెరగని జ్ఞాపకమై
ఎంత భారంగా మిగిలిపోతుందో......!!
అప్పటిదాకా ఉన్న అనురాగం
అంతదాకా పలకరించిన ఆప్యాయత
కనుమరుగై మసకబారుతుంటే...
రోదించే హృదయం
మౌనంగా వేడుకుంటోంది
పరాయికాదు పగవారు కాదు
నీ మనసు తెలిసిన నీ వాళ్ళేగా అని...
నిజమే.... మనసు తేలిసినవాళ్ళే
మరు నిముషం పలకరించాల్సిన వాళ్ళే
అందుకనే నచ్చజెప్పుకోక తప్పదు
నిన్నటిని రేపు మరువకా తప్పదు....
అశ్రుధారల నియంత్రించక తప్పదు
అయినా సరే అరక్షణమైనా సరే
బాధ పేరు బాధే కదా....
వచ్చింది కన్నీళ్ళేగా మరి..............!!
అనుశ్రీ......
88

No comments:
Post a Comment