ఒక చిరునవ్వు పూస్తుంది
నా పెదవుల పై మల్లికలా
నీ రూపం మదిలో మెదలగానే
నీ తలపు సడి నను చేరగానే....!!
కొన్ని సాయంత్రాలు కొన్ని రాత్రులు
పంచుకున్న పచ్చని వసంతాలు
గుబాలించిన నీ మనసు పరిమళాలు
మెత్తగా నన్ను తడిమేసిన భావన
ఏకాంతంలోనూ నన్నొదలని నీ ఆలోచనలు
వదలడానికి మనసే రాని మధురిమలు...
మెలకువలోనూ నీకై కలవరింతలు....!!
చిలిపి చూపులతోనే నువ్వు చెప్పే
తీయని గుసగుసల పదనిసలు
మౌనంగా శ్రద్దగా ఆలకించడంలో
లీనమైన నీ ఆధీనమైన నా మది.......!!
చింతలన్నీ మరిపించే
నీ చిరు మందహాసానికి
దాసోహమైన నా వలపు తరంగం
నీ ఒడి తీరానికి చేరాలంటూ తపిస్తోంది...!!
అనుశ్రీ.....

No comments:
Post a Comment