16....
తెరవలేని మనసులొ
మోయలేని భారాలు..
మూసి ఉన్న కళ్ళలో
చెప్పుకోలేని భావాలు..
భాషకందని భావనలు
భావానికందని భావోద్వేగాలు..
కన్నీళ్ళకి లొంగని కలతలు
కాలానికి చిక్కని వేదనలు..
కరుణించని దైవం కోసం
కన్నీటి అభిషేకాలు..!!
మాసిపోని బంధాల కోసం
మరణానికి వాయిదాలు..!!
మనవి కాని మమతల కోసం
మరు జన్మదాకా విరామాలు..!!
ఈజన్మకింతే భరించమని
అంతరంగానికి ఆదేశాలు....!!!
----అను----
తెరవలేని మనసులొ
మోయలేని భారాలు..
మూసి ఉన్న కళ్ళలో
చెప్పుకోలేని భావాలు..
భాషకందని భావనలు
భావానికందని భావోద్వేగాలు..
కన్నీళ్ళకి లొంగని కలతలు
కాలానికి చిక్కని వేదనలు..
కరుణించని దైవం కోసం
కన్నీటి అభిషేకాలు..!!
మాసిపోని బంధాల కోసం
మరణానికి వాయిదాలు..!!
మనవి కాని మమతల కోసం
మరు జన్మదాకా విరామాలు..!!
ఈజన్మకింతే భరించమని
అంతరంగానికి ఆదేశాలు....!!!
----అను----

No comments:
Post a Comment