Saturday, 15 July 2017

ఓదార్పు


నా మనసుకి
రవ్వంత నెమ్మది కావాలి..!!

ఒంటరితనపు  ఓదార్పు కావాలి..!!
ఏకాంతపు  నీడ  కావాలి..!!
మౌనంగా  నాతో నేనే  మాట్లాడుకోవాలి..!!

తెరలు తెరలుగా వస్తున్న  దుఃఖాన్ని
నాతో నేనే  పంచుకోవాలి..!!
రెప్పల చాటున దాచిన
కన్నీళ్ళన్నీ  గుమ్మరించి
గుండెకి  సేద తీర్చాలి..!!

అణువంత అవకాశం కూడా
ఎవరికీ ఇవ్వకుండా
నాలో  నేనే నిండిపోవాలి..!!
దాగిఉన్న నిన్నటిని
సాగుతున్న నేటిని
రాబోయే రేపుని
నాకుమాత్రమే  సొంతం  చేసుకోవాలి..!!

అంతు తెలియని  అగాధాలన్నీ
శూన్యంతో  నింపేయాలి..!!
గమ్యమెరుగని  దారులన్నీ
ఒంటరిగా  నడవాలి....!!
కూలిపోతున్న  కలలన్నీ
శిధిలమైన జ్ఞాపకాలుగా
పరిచయం  చేయాలి...!!

నా మనసుకి  వేసుకున్న
ముసుగును స్వయంగా
 నేనే తొలగించాలి..!!
పరాయిదైపోయిన
 ప్రేమను వదిలేసి
నాతోనేనే  చెలిమిని  చేయాలి..!!
ఏ భరోసా ఇవ్వని  తోడుకన్నా
ఒంటరి తనమే  మేలని
నచ్చజెప్పాలి....!!
నీకు నేనే ఇక  అని
ఓదార్చాలి.....!!!

     ***అను***

No comments:

Post a Comment