Saturday, 15 July 2017

!! అంతర్వాహిని !!



నా ఆలోచనలపై నేను తేలుతూ ఉంటాను
ఎక్కడ మొదలవుతుందో
ఎప్పుడు అంతమవుతుందో
తెలియని నాలోని అంతర్వాహిని
పయనిస్తూ ఉంటుంది....
పలు సందర్భాల అలలపై అలవోకగా...!!

అందులో ఏవో మాటలు ఏవో  ప్రశ్నలు
కథలూ కవితలూ మాటలు గొడవలూ
కష్టాలూ కన్నీళ్ళు ఓదార్పులు అనురాగాలు
ఎన్నో ఎన్నేన్నో మిళితమైన అనుభూతుల పరంపర ఎప్పుడో  ఆలోచన నుండి
ఏదో ఉలికిపాటుతో బయటకు వస్తే
మళ్ళీ నేను----- అదే నేను.......!!

ఇవే భావాలను పలికించేందుకు
మళ్ళీ సంసిద్దమైన నేను.......
ప్రేమలకోసం బాధ్యతల కోసం
అభిమానాలకోసం ఆత్మీయులకోసం
ఆరాటపడుతూ  మరో నేను
 కొత్తగా ఏమీ ఉండదు
రేయి పగలు....గడిచే రోజూ
గతంలాంటివే మరో అనుభవాలు
అవే భావనల  ఆనవాలు
ప్రతినిత్యం ప్రలోభాల ప్రపంచంలో
ప్రభవించే ప్రశ్నలా తృష్ణలా
నాకు నేనే ఎదురుపడుతూ
పదే పదే ప్రభవించే ఇదే నేను......!!

         అనుశ్రీ....
            

No comments:

Post a Comment