----
ఊసులేవో పలకరిస్తున్నాయి అక్షరాలుగా..
నీవు లేవన్న వెలితిని గుర్తుచేస్తూ...
రాయబారానికై నీవు పంపిన లేఖ
తీసుకెళుతోంది తీయని జ్ఞాపకాలుగా
నా మనసుని నీవెంట....!!
గడవనంటున్న క్షణాలను
యుగాలుగా లెక్కించుకుంటూ..
దరికి రాని నీ చేరువను
మదిలో స్మరించుకుంటూ
రేయిని సాగనంపి
రేపటి ఉదయాన్ని ఆహ్వానిస్తూ
నిరాశను వెలివేసి
ఆశల ఆసరా కోరుకుంటూ
ఒంటరి ఊహనై
నిన్నే తలచుకుంటున్నా.....!!
రెప్పల వెనక దాగిన కన్నీళ్ళను
గుండెలో నిండిన దిగుళ్ళను
మంత్రంలా మారి తోలగించే నీచెలిమికై
నిదుర మరిచిన కనులతో
ఎదురుచూపుల అలకతో
నిర్లిప్తమైన నా భావాలన్నీ
నిశీధిలా భయపెడుతుంటే
చేరవచ్చే నీ నీడకై చేయిచాచి పిలుస్తున్నా
అనుక్షణం నీ తలపునే జపిస్తున్నా....
అలసిపోని వలపునై నిన్నే ధ్యానిస్తున్నా...!!!
అనుశ్రీ.....
73
ఊసులేవో పలకరిస్తున్నాయి అక్షరాలుగా..
నీవు లేవన్న వెలితిని గుర్తుచేస్తూ...
రాయబారానికై నీవు పంపిన లేఖ
తీసుకెళుతోంది తీయని జ్ఞాపకాలుగా
నా మనసుని నీవెంట....!!
గడవనంటున్న క్షణాలను
యుగాలుగా లెక్కించుకుంటూ..
దరికి రాని నీ చేరువను
మదిలో స్మరించుకుంటూ
రేయిని సాగనంపి
రేపటి ఉదయాన్ని ఆహ్వానిస్తూ
నిరాశను వెలివేసి
ఆశల ఆసరా కోరుకుంటూ
ఒంటరి ఊహనై
నిన్నే తలచుకుంటున్నా.....!!
రెప్పల వెనక దాగిన కన్నీళ్ళను
గుండెలో నిండిన దిగుళ్ళను
మంత్రంలా మారి తోలగించే నీచెలిమికై
నిదుర మరిచిన కనులతో
ఎదురుచూపుల అలకతో
నిర్లిప్తమైన నా భావాలన్నీ
నిశీధిలా భయపెడుతుంటే
చేరవచ్చే నీ నీడకై చేయిచాచి పిలుస్తున్నా
అనుక్షణం నీ తలపునే జపిస్తున్నా....
అలసిపోని వలపునై నిన్నే ధ్యానిస్తున్నా...!!!
అనుశ్రీ.....
73

No comments:
Post a Comment