Friday, 14 July 2017

--పతనం---



మనుషులుగా జన్మిస్తున్నాం
మానవత్వం మరిచిపోతున్నాం...
విషపు కోరల  తెరచి
కౄరంగా కబలిస్తున్న
కులమనే రక్కసిని
పాలుపోసి పెంచుతున్నాం
పతనంలో జీవిస్తున్నాం
ఎంత ఎదిగి ఏం లాభం
ఎన్ని సాధించి ఏం ఉపయోగం
అంబేడ్కరులు మహాత్ములు కూడా
పారద్రోలలేని అంటువ్యాదిని
అంటించుకుని సాటి మనుషులనే
కనికరమైనా లేక సంహరిస్తుంటే
చేష్టలుడిగి చూస్తున్నాం....
మారని వ్యథలకు సాక్ష్యాలం అవుతున్నాం..
త్యాగజీవులుగా మారలేం
దేశభక్తులుగా ఉండలేం
కనీసం మనుషులుగానైనా
బ్రతుకుతూ బ్రతకనిచ్చే
మానవులం అవుతామా ఈ యుగాన....??

..........అనుశ్రీ......
     

No comments:

Post a Comment