Saturday, 15 July 2017

......పిన్ని.......

***జన్మదిన శుభాకాంక్షలు***

పిన్నిగారు భలే మంచివారు
చిన్ని చిన్ని పలకరింతల్లో
దీవెనల దీపాలను వెలిగిస్తూ
ఆదరణ చూపే రాజరాజేశ్వరిగారు....

ప్రశాంత వదనం
తాపీగా సమాధానం
పారే సెలయేరులా
నెమ్మదికి మరో పేరులా
నిండుగా నిర్మలంగా తన పలకరింత...

శివుడికి పార్వతిలా
రాముడికి సీతలా
బాబాయికి తోడుగా
ఆయన్ని అనుసరిస్తూ
మమ్మల్ని ఆశీర్వదిస్తూ
నూరేళ్ళూ వెలగాలని ఆశిస్తూ.....

పుట్టినరోజు శుభాకాంక్షలతో

           మీ సిరి....
               104

No comments:

Post a Comment