పక్షులలాగా రెక్కలు తొడిగి
పైపైకి హాయిగా ఎగరమంటుంది
అందమైన నిర్భయమైన బాల్యం
తగిన నిర్దేషణ లేక తొందర పడితే చెల్లించుకుంటుంది భారీ మూల్యం...!!
కోరాల్సిందేమిటో చేరాల్సిందేమిటో
తెలుసుకోలేని చిన్న తనాన
కొత్తదేదైనా దరికి పిలిచేదే
అందుకునే వీలుంటే
అన్నీ సొంతమనే అత్యుత్సాహమే
అంబరమైనా ఎగరడం సంబరమే
తిరిగి రావడమే ప్రశ్నార్థకం.....??
ఫలితం తెలియని చర్యలతో.....!!
ఆలోచనలను అదుపులో పెట్టే
సరైన రక్షణ శిక్షణ తోడై నడిపిస్తే....
అవగాహతో ఆసరా ఇస్తూ..
లోలోని లోపాలను సరిచేస్తూ
చిన్న ప్రశంస కొన్ని సలహాలతో.....
గెలుపనే కాంక్షను నమ్మకాన్ని
మనసులో పదిలంగా నాటితే.....
లక్షణమైన దారిలో నడుస్తారు....!!
నందనవనంగా భవితను
ఆదర్శవంతంగా నడతను
ఆనందంగా అలవరుచుకుని
అందంగా అద్భుతంగా
జీవితాన్ని మలచుకోగలరు.....!!
ఎత్తైన శిఖరాలనధిరోహించి
కలల సాకారంతో ఉన్నతులై
ఆకాశాన్నైనా అందుకుంటారు....
అంతులేని సంతోషాన్ని అందిస్తారు...!!
అనుశ్రీ....
పక్షులలాగా రెక్కలు తొడిగి
పైపైకి హాయిగా ఎగరమంటుంది
అందమైన నిర్భయమైన బాల్యం
తగిన నిర్దేషణ లేక తొందర పడితే చెల్లించుకుంటుంది భారీ మూల్యం...!!
కోరాల్సిందేమిటో చేరాల్సిందేమిటో
తెలుసుకోలేని చిన్న తనాన
కొత్తదేదైనా దరికి పిలిచేదే
అందుకునే వీలుంటే
అన్నీ సొంతమనే అత్యుత్సాహమే
అంబరమైనా ఎగరడం సంబరమే
తిరిగి రావడమే ప్రశ్నార్థకం.....??
ఫలితం తెలియని చర్యలతో.....!!
ఆలోచనలను అదుపులో పెట్టే
సరైన రక్షణ శిక్షణ తోడై నడిపిస్తే....
అవగాహతో ఆసరా ఇస్తూ..
లోలోని లోపాలను సరిచేస్తూ
చిన్న ప్రశంస కొన్ని సలహాలతో.....
గెలుపనే కాంక్షను నమ్మకాన్ని
మనసులో పదిలంగా నాటితే.....
లక్షణమైన దారిలో నడుస్తారు....!!
నందనవనంగా భవితను
ఆదర్శవంతంగా నడతను
ఆనందంగా అలవరుచుకుని
అందంగా అద్భుతంగా
జీవితాన్ని మలచుకోగలరు.....!!
ఎత్తైన శిఖరాలనధిరోహించి
కలల సాకారంతో ఉన్నతులై
ఆకాశాన్నైనా అందుకుంటారు....
అంతులేని సంతోషాన్ని అందిస్తారు...!!
అనుశ్రీ....

No comments:
Post a Comment