!
కాసుల వెంట పరుగులు
కాలాన్ని మరిచి ఉరుకులు
బంధాలను భారంగా
బంధుత్వాలకు దూరంగా
స్నేహాలను మానవీయ విలువలను
మరిచిపోయి భావి తరాలకు
యాంత్రిక జీవనాన్ని
అందించబోతున్న మన చర్యలు......!!
సంపదతోనే సంతోషమని భ్రమిస్తూ
పరిగెత్తి పాలుతాగాలనే ఉబలాటంలో
ఊరిని ఉనికిని మరిచి
ప్రయాస పడుతున్న నాగరికపు ధోరణీ...
క్షణమైనా విరామమివ్వక శ్రమిస్తూ
సేదతీరే తరుణాన్ని కూడా వెలేస్తూ
దూరతీరాన బతుకుతో పోరాటాలు
ఆకాశానికి నిచ్చనలేసి అందలేదని ఆవేదనలు......!!
పదిమందిలో పనికొచ్చే మాటతీరు
ఫలానా అని తలుచుకునే గుర్తింపు
సాయపడే లక్షణాలు జాలిచూపే ఆనవాలు
ఏదీ లేని అనామక జీవితం ఎవరికోసం
అంతస్తులు ఎదిగి ఏం లాభం
మానవత్వం మరిచి మనసు చిన్నదవుతుంటే.....!!
ఆత్మీయత లేని చోట ఆడంబరాలెందుకు
క్షణభంగురమైన జీవితాన కోట్లలెక్కలెందుకు
ఉన్నన్నాళ్ళూ హాయిగా తృప్తిగా జీవించి
మమతలు పంచే మంచి మనిషిగా ఎదిగి
నలుగురూ తలుచుకునే ప్రేమవైతే చాలదా
నీ తోవనే పదిమంది నడవరా.....!!
అనుశ్రీ....
కాసుల వెంట పరుగులు
కాలాన్ని మరిచి ఉరుకులు
బంధాలను భారంగా
బంధుత్వాలకు దూరంగా
స్నేహాలను మానవీయ విలువలను
మరిచిపోయి భావి తరాలకు
యాంత్రిక జీవనాన్ని
అందించబోతున్న మన చర్యలు......!!
సంపదతోనే సంతోషమని భ్రమిస్తూ
పరిగెత్తి పాలుతాగాలనే ఉబలాటంలో
ఊరిని ఉనికిని మరిచి
ప్రయాస పడుతున్న నాగరికపు ధోరణీ...
క్షణమైనా విరామమివ్వక శ్రమిస్తూ
సేదతీరే తరుణాన్ని కూడా వెలేస్తూ
దూరతీరాన బతుకుతో పోరాటాలు
ఆకాశానికి నిచ్చనలేసి అందలేదని ఆవేదనలు......!!
పదిమందిలో పనికొచ్చే మాటతీరు
ఫలానా అని తలుచుకునే గుర్తింపు
సాయపడే లక్షణాలు జాలిచూపే ఆనవాలు
ఏదీ లేని అనామక జీవితం ఎవరికోసం
అంతస్తులు ఎదిగి ఏం లాభం
మానవత్వం మరిచి మనసు చిన్నదవుతుంటే.....!!
ఆత్మీయత లేని చోట ఆడంబరాలెందుకు
క్షణభంగురమైన జీవితాన కోట్లలెక్కలెందుకు
ఉన్నన్నాళ్ళూ హాయిగా తృప్తిగా జీవించి
మమతలు పంచే మంచి మనిషిగా ఎదిగి
నలుగురూ తలుచుకునే ప్రేమవైతే చాలదా
నీ తోవనే పదిమంది నడవరా.....!!
అనుశ్రీ....

No comments:
Post a Comment