Saturday, 15 July 2017

ఆశల పయనం




తడబడుతున్నాయి నా అడుగులు
చీకట్లను ఛేదిస్తూ ఆలోచనలను ఆపేస్తూ
గమ్యం దిశగా సాగాలనే నా ఆరాటం
నడవమంటూ ఆదేశాలిస్తోంటే....!!

నిశీధి నీడలలో  పరుచుకున్న నిరాశలో
ఏ ఆసరా అయినా దొరుకుతుందేమో
నడిచేదారిలో తోడవుతుందేమోనని
ఎదురుచూసి అలసిన మనసు
ఇక ఆగనంటూ సాగమంటోంది...!!

సమస్యల వలయాన్ని
చిక్కుముడుల బంధాలని
వదిలించుకునే యత్నంలో
నన్ను నేను మరవకుండా
మనోధైర్యం ఎదురు పడుతోంది...
ముందుకెళ్ళే తోవ చూపుతోంది.....!!

కాలు కదిలితేనే కదా కలల జాడ తెలిసేది
బలం తెచ్చుకుంటేనే గా
బ్రతుకు బరువు తగ్గేది
భయాలకు లొంగక నిస్సృహలకు కుంగక
గెలుపే లక్ష్యంగా వెతుకుతున్నా దారిని
ఏ అఘాదమూ నన్నాపకుండా
నన్ను నేనే తోడుగా నడిపించుకుంటున్నా...!

            అనుశ్రీ....






No comments:

Post a Comment