Pvr Murty గారి చిత్రం.....
నూరేళ్ళకు గానూ
రాసుకున్న ఒప్పందం......
కష్టాల్లో నష్టాల్లో ఏకమై
ఒకరికి ఒకరై ఎదురీదాలని
అనుకున్న అనురాగం.......
అన్యోన్యంగా ఆనందంగా
గడపాల్సిన తరుణం
అగాధంలో తోసేసి
దిగాలుగా చూస్తుంటే.......
వంచించిన విథి రాతకు కుమిలి
కార్చిన్న కన్నీళ్ళే ఓదార్పులనుకుని
కన్న బిడ్డల కోసం కష్టాన్ని దిగమింగి
పెంచుకున్న బంధం తెంచుకుని వెలుతుంటే
ముంచుకొచ్చి అంటుకున్న వైధవ్యం
మనసైన మనిషి తోడు లేదని
మనిషి మనిషికీ చూపిస్తుంటే
సానుభూతి పలకరింపులు
జాలి చూపుల మోహరింపుల మధ్య
మరింత చిన్నబుచ్చే చేదు అనుభవాలు
నలుగురిలో కలవకుండా కలవరపెడుతూ
జీవచ్చవాన్ని చేస్తూ జీవితమంతా
వెంటాడుతూ వేటాడుతుంటే...
గుండెలో గూడుకట్టుకున్న బాధ
కళ్ళలో నిండిపోయిన నిర్వేదం
పయనించే గమనంలో
వెంటవచ్చే అడుగులుగా
బాధ్యతలనే గమ్యంగా తలచి
అలసిపోతున్న హృదయాన్ని
ఊరడించుకుంటూ సాగాల్సిన
అంతులేని అవేదనైన పయనం...
ఎన్నేళ్ళుగానో చేస్తున్న నోములు వ్రతాలు
వద్దని దేవుడు సైతం వెలేస్తుంటే
కళ తప్పిన వదనంలో కలల జాడ లేక
చివరి ఘడియని కూడా
తృప్తిగా తలుచుకోలేని వైనం
అతివల పాలిట అంతులేని శాపం....!!
అనుశ్రీ....
82
నూరేళ్ళకు గానూ
రాసుకున్న ఒప్పందం......
కష్టాల్లో నష్టాల్లో ఏకమై
ఒకరికి ఒకరై ఎదురీదాలని
అనుకున్న అనురాగం.......
అన్యోన్యంగా ఆనందంగా
గడపాల్సిన తరుణం
అగాధంలో తోసేసి
దిగాలుగా చూస్తుంటే.......
వంచించిన విథి రాతకు కుమిలి
కార్చిన్న కన్నీళ్ళే ఓదార్పులనుకుని
కన్న బిడ్డల కోసం కష్టాన్ని దిగమింగి
పెంచుకున్న బంధం తెంచుకుని వెలుతుంటే
ముంచుకొచ్చి అంటుకున్న వైధవ్యం
మనసైన మనిషి తోడు లేదని
మనిషి మనిషికీ చూపిస్తుంటే
సానుభూతి పలకరింపులు
జాలి చూపుల మోహరింపుల మధ్య
మరింత చిన్నబుచ్చే చేదు అనుభవాలు
నలుగురిలో కలవకుండా కలవరపెడుతూ
జీవచ్చవాన్ని చేస్తూ జీవితమంతా
వెంటాడుతూ వేటాడుతుంటే...
గుండెలో గూడుకట్టుకున్న బాధ
కళ్ళలో నిండిపోయిన నిర్వేదం
పయనించే గమనంలో
వెంటవచ్చే అడుగులుగా
బాధ్యతలనే గమ్యంగా తలచి
అలసిపోతున్న హృదయాన్ని
ఊరడించుకుంటూ సాగాల్సిన
అంతులేని అవేదనైన పయనం...
ఎన్నేళ్ళుగానో చేస్తున్న నోములు వ్రతాలు
వద్దని దేవుడు సైతం వెలేస్తుంటే
కళ తప్పిన వదనంలో కలల జాడ లేక
చివరి ఘడియని కూడా
తృప్తిగా తలుచుకోలేని వైనం
అతివల పాలిట అంతులేని శాపం....!!
అనుశ్రీ....
82

No comments:
Post a Comment