చాలా సార్లు అనిపిస్తోంది
వేదన నిండిన జీవనం
ఒంటరైన పయనం
ఎంతటి విషాదమో అని
ఓదార్పుకి ప్రేమకి నోచుకోక
కలిసి నడిచే తోడులేక
తపించే మనసు పడే
అంతులేని యాతన...!!
కపట ప్రేమలకు బానిసై
కల్లోలమైన గమనమై
కలసిరాని కాలంతోనే స్నేహమై
వేగలేక కొనసాగుతుంటే...
సంతోషం వచ్చినట్టే వచ్చి
తనతో తెచ్చే కన్నీళ్ళతో
ముంచేస్తోంటే
సరదాగా చూసే వాళ్ళ
మధ్య ఇమడలేక
సాగుతున్నా ఆగిపోయే క్షణం కోసం...
నా కథ ముగిసిపోయే దినం కోసం...!!
అను----
40

No comments:
Post a Comment