వేసుకున్నా మనసుకొక ముసుగుని
దాచుకున్నా చెప్పలేని ఆందోళనని
అల్లుకున్న బంధాలకై పడుతున్నా
అంతరంగాన అంతులేని ఆవేదనని
కనిపించే నవ్వునై కానరాని బాధనై
కరుగుతున్న విషాదమై నలుగుతున్నా
వారిస్తున్నా వస్తున్న కన్నీళ్ళన్నీ
ఏకాంతాన ఓదార్పుకై వాడుతున్నా....
వెలుగు దోచిన వెతల నడుమ
చీకటి నదినై ప్రవహిస్తున్నా....
కాలం మార్చని దిగుళ్ళని
తలరాతంటూ స్వీకరిస్తున్నా....
యదలో రొదల సహవాసాలకు
ఏదో ఒక మలుపుందని ఆశిస్తున్నా..!!
అనుశ్రీ....
72

No comments:
Post a Comment