మనసులో నిండిన ఎన్నో భావాలు
నిలకడ లేని మనుషులతో
నిబద్దత కొరవడిన మనసులతో
ఏ భావాన్ని ఎలా ప్రకటించాలో
అర్థం కాక తడుముకునే క్షణాలు...!!
నవ్వులనే తప్ప దాని వెనక
బాధని చదవలేని కొందరు....
సంతోషంగా ఉన్నామంటే
సందేహాలతో ప్రశ్నించే కొందరు...
మనలోని నైరాశ్యాన్ని చూసి
ఆనందించే కొందరు.....
అందరి మధ్యా అసలు ముఖం
నిజమైన మనస్తత్వం
తెరుచుకోని పుస్తకంలాగా
నిగూఢమైన అక్షరంలా
ఎప్పుడో అంతరంగ శోధనలో
మనలని మనం చూసుకున్నపుడే
స్పష్టమై గోచరించేది.....
చూసిన మనుషులే తెలిసిన పరిస్థితులే
అయినా సంధించే శరాఘాతాలెన్నో
అందుకే సందర్భానికో వదనం
అవసరానికో అబద్దపు నవ్వు
చూపించక తప్పదేమో.......
కన్నీళ్ళకు నవ్వులని ఆశకు నిట్టూర్పులను
అంటించుకోక తప్పదేమో......!!
అనుశ్రీ....

No comments:
Post a Comment