మనసు వనానికి
వసంతమేదో వచ్చీంది......!!
మౌనమైన నా గొంతులో
కొత్తస్వరమేదో తొణికింది.....!!
అందమైన ఋతువులోని
తొలి చివురుల దరహాసంలా.....!!
పలకరింతల సందడులలో
మురిసే సమీరాల కోలాహలంలా...
పండగేదో వచ్చింది పరువానికి
వలస వచ్చిన వనమాలివై
వలపుల నిధి వారధివై నువు నడిచొస్తుంటే
తొణకని నీ చూపుల జల్లులో తడిసిపోతున్నా,.
పసిడి పూల సుమ మాలికలతో
పరవశాల పచ్చని పొదరింటిలో
నీ ఆరాధనే మదిని మెదిలుతుంటే
నీ అడుగుల సడి నీవొచ్చేజాడ తెలుపుతుంటే
చేతులు చాచి పిలుస్తున్నా
నా ఆత్మీయ నేస్తాన్ని అనురాగ హస్తాన్ని..!!
అనుశ్రీ.....

No comments:
Post a Comment