..... శుభాకాంక్షలు.....
మనసొక అందాల పూలవనం
మాటొక మధుర మకరందం
ఆప్యాయతకు తొలి అడుగు
మంచిలో ఉండే మొదటి పేరు....!!
నిశ్చలమైన మది నీది
నిర్మలమైన ప్రేమ నీది..
కల్మషాలు అంటని మనసు
కలుషితాలు ఎరుగని మాట...
నిస్వార్థమైన అనురాగానికి
అసలైన చిరునామా నువ్వు........
మా అందరి ఆనందాల లోకం నువ్వు...
బంధాలను నిలబెడుతూ
కష్టంలో చేయూతనిస్తూ
సాయానికి సదా సన్నద్దమవుతున్న
నిన్ను చూసి నిత్యం ఆనందిస్తున్నాం
ఇలాగే దినందినం ఎదగాలి
నువు ఎంతో ఉన్నతంగా...
నిను చూసి మురవాలి మేమంతా గర్వంగా...!!
ప్రియమైన తమ్ముడికి జన్మదిన శుభాకాంక్షలు.....
అనుశ్రీ......
మనసొక అందాల పూలవనం
మాటొక మధుర మకరందం
ఆప్యాయతకు తొలి అడుగు
మంచిలో ఉండే మొదటి పేరు....!!
నిశ్చలమైన మది నీది
నిర్మలమైన ప్రేమ నీది..
కల్మషాలు అంటని మనసు
కలుషితాలు ఎరుగని మాట...
నిస్వార్థమైన అనురాగానికి
అసలైన చిరునామా నువ్వు........
మా అందరి ఆనందాల లోకం నువ్వు...
బంధాలను నిలబెడుతూ
కష్టంలో చేయూతనిస్తూ
సాయానికి సదా సన్నద్దమవుతున్న
నిన్ను చూసి నిత్యం ఆనందిస్తున్నాం
ఇలాగే దినందినం ఎదగాలి
నువు ఎంతో ఉన్నతంగా...
నిను చూసి మురవాలి మేమంతా గర్వంగా...!!
ప్రియమైన తమ్ముడికి జన్మదిన శుభాకాంక్షలు.....
అనుశ్రీ......

No comments:
Post a Comment