Saturday, 15 July 2017

ప్రతిబింబం



అద్దమంటి మనసుకంటిన
మరకల్ని  తుడిచే
ఆప్యాయత కానరాక
అస్పష్టమవుతోంది
నా ప్రతిబింబం......!!!!!

అంతరంగంలో
నాకు నేనే కానరాక
నన్ను నేనే వెతుకుతున్నా....!!!

నిరాశల నిశీదుల్లో
అంతులేని  ఆలోచనల్లో
మసకబారిన  వెలుతురుల్లో...
తరచి తరచి చూస్తే
కొద్ది కొద్దిగా
స్పష్టమవుతున్న నారూపాన్ని
చూస్తే  అర్థం అవుతోంది..,,!!!!

నన్ను నేను కనుగొన్నది
గతంలో ఆగిపోయిన నన్నని
వర్తమానం నన్ను చూపించలేదని
ఇక నాకు నేనే అపరిచితమని
అదృష్యమైన నీడనని....

     అను---

No comments:

Post a Comment