------
"నాన్న "అనే మాట
చెవిన పడ్డ ప్రతిసారి
ఎక్కడో మనసు పొరల్లో ఏదో కదలిక..!!
తనలో కదులుతున్న నీ స్మృతులను
గతం తాలూకు జ్ఞాపకాలని
చూడమంటూ ఓ సంకేతం..
కానీ కదిలించే ధైర్యమేది ......!!
నాకు తెలుసు తాకితే
కన్నీటి కెరటమై ఎగిసి పడుతుందని,
కన్నీళ్ళన్నీ కాలగర్భంలో
కలిపేయాలని చూసినా..
నాన్నగా నువు పంచిన ప్రేమ
ఆ గుర్తులనే నువ్వుగా ఆస్వాదించమంటోంది..!!
మా దిన చర్యలో ఒక భాగం
నువ్వు ఉన్నావనే ఊహలో మునగడం
మా మనసులకి ప్రేమని దూరం చేసావేం
అని అడిగి అలగాలని ఉంది
కానీ ఆ అలక తీర్చే నువ్వు రావని
చాలా ఏళ్ళకి తెలిసొచ్చింది..!!!!!
అప్పటినుండే అలవాటులా మారింది
బాధని మౌనంగా భరించడం..!!!!!
అమ్మని ఒంటరిగా చూసిన ప్రతి సారి..
నా బాధ్యత మోసే నువ్వు లేవని
భయం వేసిన ప్రతిసారి..
ఇంత త్వరగా నాకు పెద్దరికం వచ్చిందనిపించిన ప్రతిసారి..
బయటకు చెప్పుకోలేనంత బాధ..
చెప్పినా ఎవరికీ అర్థం కాని బాధ ..
ఎవరూ ఓదార్చినా తీరని బాధ..
నీలాగా మాకోసం ఎవరూ లేరనే బాధ...!!
నీతో ఆడిన ఆటలు,
పాడిన పాటలు గుర్తోస్తే
ఆ బాల్యం తిరిగొస్తే చాలనిపిస్తుంది
అయినా అవేవీ జరగవు
మా కోరికలూ తీరవు...!!!
కానీ ఒకే ఒక్క నమ్మకం
నీడలా మా వెన్నంటి ఉండి
మమ్మల్ని నడిపించేది నువ్వేనని..!!
గెలిచినపుడల్లా నీ ఆశీర్వాదమని
ఓడినపుడల్లా హెచ్చరిస్తున్నావని..!!
నీప్రేరణే ఈ రోజు మేము..!!
మమ్మల్ని చూసి గర్వించే
నువ్వులేని లోటు పూడ్చటం
ఆ దేవుడికి కూడా అసాధ్యం..!!
అయినా మాగుండెల్లో "నాన్నలా"
మేమున్నంతకాలం నువ్వు పదిలం..!!
అనుశ్రీ.....
(మూడు సంవత్సరాల క్రితం రాసుకున్నది)
"నాన్న "అనే మాట
చెవిన పడ్డ ప్రతిసారి
ఎక్కడో మనసు పొరల్లో ఏదో కదలిక..!!
తనలో కదులుతున్న నీ స్మృతులను
గతం తాలూకు జ్ఞాపకాలని
చూడమంటూ ఓ సంకేతం..
కానీ కదిలించే ధైర్యమేది ......!!
నాకు తెలుసు తాకితే
కన్నీటి కెరటమై ఎగిసి పడుతుందని,
కన్నీళ్ళన్నీ కాలగర్భంలో
కలిపేయాలని చూసినా..
నాన్నగా నువు పంచిన ప్రేమ
ఆ గుర్తులనే నువ్వుగా ఆస్వాదించమంటోంది..!!
మా దిన చర్యలో ఒక భాగం
నువ్వు ఉన్నావనే ఊహలో మునగడం
మా మనసులకి ప్రేమని దూరం చేసావేం
అని అడిగి అలగాలని ఉంది
కానీ ఆ అలక తీర్చే నువ్వు రావని
చాలా ఏళ్ళకి తెలిసొచ్చింది..!!!!!
అప్పటినుండే అలవాటులా మారింది
బాధని మౌనంగా భరించడం..!!!!!
అమ్మని ఒంటరిగా చూసిన ప్రతి సారి..
నా బాధ్యత మోసే నువ్వు లేవని
భయం వేసిన ప్రతిసారి..
ఇంత త్వరగా నాకు పెద్దరికం వచ్చిందనిపించిన ప్రతిసారి..
బయటకు చెప్పుకోలేనంత బాధ..
చెప్పినా ఎవరికీ అర్థం కాని బాధ ..
ఎవరూ ఓదార్చినా తీరని బాధ..
నీలాగా మాకోసం ఎవరూ లేరనే బాధ...!!
నీతో ఆడిన ఆటలు,
పాడిన పాటలు గుర్తోస్తే
ఆ బాల్యం తిరిగొస్తే చాలనిపిస్తుంది
అయినా అవేవీ జరగవు
మా కోరికలూ తీరవు...!!!
కానీ ఒకే ఒక్క నమ్మకం
నీడలా మా వెన్నంటి ఉండి
మమ్మల్ని నడిపించేది నువ్వేనని..!!
గెలిచినపుడల్లా నీ ఆశీర్వాదమని
ఓడినపుడల్లా హెచ్చరిస్తున్నావని..!!
నీప్రేరణే ఈ రోజు మేము..!!
మమ్మల్ని చూసి గర్వించే
నువ్వులేని లోటు పూడ్చటం
ఆ దేవుడికి కూడా అసాధ్యం..!!
అయినా మాగుండెల్లో "నాన్నలా"
మేమున్నంతకాలం నువ్వు పదిలం..!!
అనుశ్రీ.....
(మూడు సంవత్సరాల క్రితం రాసుకున్నది)

No comments:
Post a Comment