Saturday, 15 July 2017

గుండె

!!!! గుండె !!

ముక్కలవుతున్న గుండె గాథ
నిరాశల నిక్షిప్తాల భారాలను
మోయలేక
ముగిసిన కథగా మిగిలిపోతోంది...!!

తిరిగి అతకదన్న సత్యంతెలిసి
వంచించే  మనుషులకు
చెప్పేందుకు సమాధానం లేక
రాసుకున్న తీపిరాతలు చెరపలేక
నమ్ముకున్న చోటనే వమ్ము కాలేక
 విరిగి పడే శకలాలుగా
ముడి పడని స్నేహాలుగా
అదృష్యమై అంతరిస్తోంది.....!!

నింపుకున్న ఆశలన్నీ అడియాసలై
పొదువు కున్న ప్రేమలన్నీ అత్యాశలై....
అంధకారమైన  ప్రతిబింబమై
అందుకోలేని బాంధవ్యమై
అనుక్షణమూ అనుభవించిన
చిత్రహింసలలో చితికిపోయి
మరల మరల మరణం వద్దంటూ
మృత్యురూపమై ముగిసిపోతోంది....!!

        అనుశ్రీ....

(చిత్రాన్ని చూసి రాసిన కవిత)
           

ముక్కలవుతున్న గుండె గాథ
నిరాశల నిక్షిప్తాల భారాలను
మోయలేక
ముగిసిన కథగా మిగిలిపోతోంది...!!

తిరిగి అతకదన్న సత్యంతెలిసి
వంచించే  మనుషులకు
చెప్పేందుకు సమాధానం లేక
రాసుకున్న తీపిరాతలు చెరపలేక
నమ్ముకున్న చోటనే వమ్ము కాలేక
 విరిగి పడే శకలాలుగా
ముడి పడని స్నేహాలుగా
అదృష్యమై అంతరిస్తోంది.....!!

నింపుకున్న ఆశలన్నీ అడియాసలై
పొదువు కున్న ప్రేమలన్నీ అత్యాశలై....
అంధకారమైన  ప్రతిబింబమై
అందుకోలేని బాంధవ్యమై
అనుక్షణమూ అనుభవించిన
చిత్రహింసలలో చితికిపోయి
మరల మరల మరణం వద్దంటూ
మృత్యురూపమై ముగిసిపోతోంది....!!

        అనుశ్రీ....

(చిత్రాన్ని చూసి రాసిన కవిత)
               94

No comments:

Post a Comment