అక్షయతృతీయ అనగానే
మనసులొ బంగారం మెరుపులు
అమ్మవారి చిరు నగవుల్లా
తళుకు బెళుకుల నగలు
కళ్ళముందు కనబడుతూ
ఆలోచనలన్నీ సువర్ణమయం చేస్తుంటాయి..!!
ఒకరిని చూసి ఒకరు......
ఒకరి కంటే ఒకరు.......
పోటా--పోటీగా ......
సాంప్రదాయం పేరిట....
పసిడిపై ప్రేమ పేరిట.....
పిల్లలకు కానుకల పేరిట...
శ్రీవారి ప్రేమ పేరిట......
ఏ పేరైతేనేం చూపంతా ఒకేచోట
ఇదే మాట ప్రతినోట......!!
డాబుకైతేనేం దర్జాకైతేనేం
కరువో కారణమా కోరిక బలపడితే
ఉన్నంతలో కొంత ఈ పేరుతో..,.
కాస్తపొదుపు కాస్త ధైర్యం.....
రెండూ కలిపి అడుగులు వేయిస్తున్నాయి
హంగులున్న అద్దాల మేడలవైపు...!!
అవకాశం వచ్చిందని వ్యాపారుల
ఊరించే రకరకాల ప్రకటనలు
ఆనవాయితీగా ఇసుమంతైనా సరే
కొనాలనే మధ్యతరగతి ఆరాటం
మహాలక్ష్మిని బంగారంగా తెచ్చుకొవాలని...
ధనవంతులమవాలనే వేడుకోలు....!!
పండగ పూట సత్కార్యంలాగా
ఆదుకునే ఆపన్న హస్తం లాగా
పుణ్యానికి పుణ్యం జోడించి
ఆశగా ఎదురుచూసే పేద స్వర్ణకారులపై
ఆత్మీయత చూపి ఆదుకునే దిశగా
కొన్ని చేతులైనా ఆసరా ఇస్తూ
పండగని కూడా పంచుతూ
మహాలక్ష్మి ఆశీస్సుల అందరికీ పంచి
వాళ్ల సంతోషానికీ కారణమైతే మంచిదేగా..!
దినపత్రికలో ప్రకటనల వెల్లువ లు చూసి
నా ఆలోచనలో వచ్చిన చిన్న విన్నపమే
మంచి మనసుతో తప్పుపట్టబోరనే నమ్మకం
అనుశ్రీ......
90

No comments:
Post a Comment